నిత్యవసర సరుకులు వితరణ
- PRASANNA ANDHRA

- Jul 3, 2023
- 1 min read
శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు వితరణ చేయడం జరిగింది

జమ్మలమడుగు నియోజవర్గం, ఎర్రగుంట్ల మండలం పోట్లగుత్తి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, చిన్న రేకుల కోటంలో భార్య భర్త వచ్చే రేషన్ బియ్యం తోనే ఇల్లు గడవడానికి కష్టంగా ఉందని మాలెపాడు గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ చంద్ర శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి తెలియజేసారు. దాతలు పొన్న వెంకటస్వామి, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అశోక్ మమత సహకారంతో నిత్యవసర సరుకులు ఆకుకూరలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ జమ్మలమడుగు ప్రెసిడెంట్ ఆదినారాయణ, సురేంద్ర, ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్ర పాల్గొన్నారు.








Comments