top of page

అభిమానుల కోలాహలం నడుమ చల్లా జన్మదిన వేడుకలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 7, 2023
  • 1 min read

అభిమానుల కోలాహలం నడుమ చల్లా జన్మదిన వేడుకలు

ree
ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


రక్తం చిందించే రోజులకు స్వస్తి పలుకుదాం... ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందించే రోజులకు స్వాగతం పలుకుదాం... అంటూ బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి చల్లా రాజగోపాల్ యాదవ్ జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక టీటీడీ కల్యాణ మండపం నందు చల్లా ఫౌండేషన్ మరియు ఫ్రెండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారం మునిరెడ్డి విచ్చేసి చెల్లా రాజగోపాల్ యాదవ్ ను గజమాలతో సత్కరించి, అనంతరం కేక్ కట్ చేయించారు. అలాగే పట్టణంలోని పలువురు ప్రముఖులు ఆయనను పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన రాగా డిస్టిక్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, ప్రొద్దుటూరు శాఖ వారు రక్త దాతల నుండి రక్తాన్ని సేకరించారు.

ree

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చల్లా రాజగోపాల్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాను తన అభిమానుల నడుమ జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, కాగా నేటి సంవత్సరం తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందించాలనే సదుద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశానని, ఇందుకు సహకరించిన ఆయన అభిమానులకు, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున చల్లా రాజగోపాల్ అభిమానులు, బీసీ సంక్షేమ సంఘం మెంబర్లు, పట్టణ ప్రజలు, పలు పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ree
ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Jun 07, 2023
Rated 5 out of 5 stars.

Happy Birthday Anna

Like
bottom of page