top of page

ఏపిఏన్జివోస్ నూతన కార్యవర్గం ఎన్నిక

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 4, 2022
  • 1 min read

ఏపిఏన్జివోస్ నూతన కార్యవర్గం ఎన్నిక


శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు కొఱ్ఱపాడు రోడ్డులోని NGO హోమ్ నందు ప్రొద్దుటూరు ఎన్.జీ.ఓ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఏపిఏన్జివోస్ ప్రోద్దుటూరు అధ్యక్షుడు గా కె.జె.రఘురామిరెడ్డి, కార్యదర్శి గా జె.రామసుబ్బయ్య, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ree

శుక్రవారం ఉదయం ప్రోద్దుటూరు ఎన్జీవో హోమ్ నందు జరిగిన నామినేషన్లు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వై.ఎస్.ఆర్ జిల్లా ఏన్జీవో అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఎన్నికల అదికారిగా టి శ్రీనివాసులు, అబ్జర్వర్ జిల్లా కార్యదర్శి డి.రవికుమార్ లు నామినేషన్లను స్వీకరించారు, అన్ని పోస్టులకు సభ్యుల నుండి ఓక్కోక్క నామినేషన్ రావడం తో ఎన్నికల అదికారి ఏకగ్రీవంగా ప్రకటిస్తూ, అధ్యక్షుడిగా కె.జె.రఘరామరెడ్డి, సహ అధ్యక్షునిగా సి.సదాశివయ్య, ఉపాధ్యక్షులు గా పి.ఐ.సంద్యారాణి, యమ్.జయంతి కుమారి, నాగరాజు, మధురామాంజులు, కార్యదర్శి జె.రామసుబ్బయ్య, సంయుక్త కార్యదర్శులు పార్థసారథి రామయ్య రాజశేఖర్, సుబ్బారెడ్డి, ఉమెన్ సంయుక్త కార్యదర్శి గా పి.సంద్యారాణి, డి.ఇ.సి సభ్యులుగా సరస్వతమ్మ లక్ష్మీ కర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ టి.రవికుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి యన్ ప్రభంజనకుమార్ రెడ్డి, కోశాధికారి గా ఇ.ప్రమీల లను ఏకగ్రీవంగా ఏన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహ అధ్యక్షుడు టి.తిమ్మారెడ్డి, కోశాధికారి నిత్యా పూజయ్య, పద్మనాభం పాల్గొన్నారు.

ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మూడోవ సారి తన మీద నమ్మకం ఉంచి అధ్యక్షునిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్, కార్యదర్శి డి.రవికుమార్ లకు, ప్రోద్దుటూరు ఓటరు మహశేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. నూతన కార్యవర్గానికి జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్, జిల్లా కార్యదర్శి డి.రవికుమార్ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page