top of page

వైస్సార్ ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భావించిన పార్టీ వైస్సార్సీపీ - ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 12, 2022
  • 1 min read

ree

గాజువాక, వై ఎస్ ఆర్ సిపి పార్టీ ఆవిర్భవావదినోత్సవ వేడుకులను గాజువాక పార్టీ కార్యలయంలో ఘనంగా నిర్వహించారు .72 వ వార్డు పార్టీ ఇంచార్జ్ సిరట్ల శ్రీనువాసు & తిప్పల వంశీ రెడ్డి ఆధ్వర్యంలో గాజువాక పార్టీ కార్యలయంలో నిర్వహించిన ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు.

ree

అనంతరం ఎమ్మెల్యే నాగిరెడ్డి మట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక చీకటిరోజులు తొలగిపోయి పేద ప్రజల ఇళ్లల్లో కొత్త వెలుగులు ఉదయించాయని . రాష్ట్రంలో ప్రజల కష్టాలను తీర్చి ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించారాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ఎన్నికలలో ఇచ్చిన హమీలను నెరవేర్చక కాలయాపన చేసి రాష్ట్ర ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తే అధికారంలోకి వచ్చిన మన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తుచా తప్పక నెరవేర్చడమే కాకుండా హామీలు ఇవ్వని మరిన్ని పధకాలను మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తూ తండ్రికి తగ్గ తనయుని వలే మన రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సుబిక్షంగా పరిపాలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలుకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ విశ్వాసిస్తున్నారని అన్నారు. తొలత రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలభిషేకలు నిర్వహించి ఘన నివాళులార్పించారు. అనంతరం సేవాదళ్ వాసు ఆర్థిక సహాయంతో పూర్తి అనాధాశ్రమం లో ఉన్న విద్యార్థులకు కంచాలు బిస్కెట్లు ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పెరేటర్లు తిప్పల వంశీ రెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, రాజన రామారావు, భూపతి రాజు సుజాత, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి చందు, మంత్రి రాజశేఖర్,dcms చైర్మన్ పల్లా చిన్న తల్లి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page