top of page

యూట్యూబర్లకు డీఎస్పీ హెచ్చరిక - ప్రొద్దుటూరు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 20, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు DYSP కార్యాలయంలో నేడు డీఎస్పీ వై. ప్రసాద రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో ఒకటి అయినా యూట్యూబ్ చానెల్స్ ద్వారా పట్టణంలో జరిగే వివిధ కార్యక్రమాలు, రాజకీయ నాయకుల పత్రికా సమావేశాలు యూట్యూబ్ చానెల్స్ ద్వారా ప్రసారం చేయటం మంచిదే అయినా, కొన్ని సందర్భాలలో నాయకుల విమర్శలు వాటి ప్రతివిమర్శలు ప్రసారం చేయటంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని అసందర్భ వ్యాఖ్యలు ఎడిట్ చేసి ప్రసారం చేయవలసినదిగా ఆయన కోరారు, ఇలా చేయని యెడల అప్లోడ్ చేసిన వీడియో వలన ఏదయినా అసాంఘిక చర్యలు జరిగితే, అందుకు సదరు యూట్యూబ్ యాజమాన్యం అలాగే సదరు విలేఖరి పై చట్టపరమైన చర్యలు అనగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సున్నితంగా హెచ్చరించారు. అలాగే వాట్సాప్ ద్వారా ఎవరయినా గ్రూపులోని సభ్యులు ఇలాంటి వీడియోలు కలిగిన లింకులు షేర్ చేసినా లేదా పూర్తి వీడియో గ్రూపు నందు పంపించిన ఎడల సదరు గ్రూపు అడ్మిన్ ముందుగా ఆ వ్యక్తికి తీసివేయమని కోరటం (డిలీట్ ఫర్ అల్) లేదా సదరు వ్యక్తిని గ్రూపు నుండి తొలగించాలని కోరారు. ఈ సమావేశానికి డీఎస్పీ ప్రసాద్ రావు, ఒకటవ పట్టణ సిఐ నాగరాజు, రెండవ పట్టణ సిఐ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page