జూనియర్ కాలేజీలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన కొరముట్ల
- DORA SWAMY

- Mar 19, 2022
- 1 min read

ఈరోజు మధ్యాహ్నం ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు చేతుల మీదుగా ప్రారంభించారు. కళాశాల ఆవరణలో చెట్లను నాటారు. అధ్యాపకులు మరియు విద్యార్థుల తో కలసి బోధనా విషయాలను, అక్కడ అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమేష్ రెడ్డి, నాగ శివశంకర్ రెడ్డి, ఎంపీటీసీ దుర్గాప్రసాద్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, హెడ్ మిస్ శారద, పెంచలయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.









Comments