top of page

సాహసోపేత నిర్ణయాలు.. మోడీ కే సాధ్యం..!! వెంకట రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 21, 2023
  • 1 min read

సాహసోపేత నిర్ణయాలు.. మోడీ కే సాధ్యం..!!

---ఆకేపాటి వెంకటరెడ్డి.

ree

భారత దేశ ప్రజల కు మేలు చేకూర్చే విధంగా.. అసాధ్యం అనుకున్న సాహసోపేత నిర్ణయాలను సుసాధ్యం చేయడం భారతదేశ ప్రధానమంత్రివర్యులు నరేంద్ర మోడీ కి , బిజెపి ప్రభుత్వాని కే సాధ్యమవుతుందని చిట్వేలి మండల బిజెపి అధ్యక్షులు ఆకేపాటి.వెంకటరెడ్డి గురువారం ప్రసన్న ఆంధ్రకు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు పెద్దపీటను వేస్తూ 33% రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయమని వెంకటరెడ్డి తెలిపారు.

ree

బిల్లు ఆమోదంతో లోక్ సభ, రాష్ట్ర శాసనసభల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మహిళలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఇది మహిళల రాజకీయ పురోగతికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో వంతు మహిళా రిజర్వేషన్ ద్వారా లోక్ సభలో 543 మంది అభ్యర్థులకు గాను 181 మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందనీ,ఇది మునుపటి కంటే రెట్టింపు అని అన్నారు. ఇట్టి సాహసోపేత నిర్ణయాలతో దేశ చరిత్రలో నరేంద్ర మోడీ ఒక సువర్ణ అధ్యాయానికి పునాది వేసిన వ్యక్తిగా మహిళా పక్షపాతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిలుస్తారని ఆకేపాటి వెంకట్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తపరిచారు. దేశ పురోగతికి నరేంద్ర మోడీని గెలిపించడం ఎంతైనా అవసరమని తాను తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page