top of page

వైసీపీ కి పతనం అరంభమైనట్లే - చమర్తి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 19, 2023
  • 1 min read

ఎమ్మెల్సీ ఫలితాలతో రాష్ట్రంలో మార్పు స్పష్టం

ree
చమర్తి జగన్ మోహన్ రాజు

వైసీపీ కి పతనం అరంభమైనట్లే - చమర్తి జగన్ మోహన్ రాజు


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసనమండలి పట్టుభధ్రుల ఎన్నికలలో టీడీపీ అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేయడం టీడీపీ విజయానికి శుభారంభం, వైకాపా పతనానికి అరంభం అని.. ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. ఆదివారం అయన తన కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడే దిశగా పట్టుభద్రులు తీర్పు చెప్పారన్నారు. రాష్ట్రంలో పెను మార్పు రావడానికి ప్రధాన కారణం విద్యావంతులే అన్నారు. టీడీపీ బలోపేతానికి యువత కంకణం కట్టుకొని శ్రమించారన్నారు. వారి ఆలోచనా విధానాలే విజయపథంలో నడిపించయన్నారు. ఇదే ఉత్సాహంతో దూసుకుపోయి టీడీపీ ని అధికారంలోకి తీసుకురావాలని అయన పిలుపునిచ్చారు.

ree

ఈ ఎన్నికల ఫలితాలతో వైసీపీ నాయకుల ముఖాల్లో దిగులు కనిపిస్తోందన్నారు. టీడీపీ గెలుపును జీర్ణించుకోలేక ఎన్ని కుతంత్రాలు చేశారో అందరికీ తెలుసన్నారు. మేమే తెలివైన వాళ్ళం, మేము చెప్పినట్లే జరుగుతుందని అధికార అహంకారంతో విర్రవీగిన వైసీపీ నాయకులకు విద్యావంతులు సరైన గుణపాఠం చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పతనం ఆరంభమైందని, రాష్ట్ర ప్రజలు వైసీపీ ని తిరస్కరిస్తున్నారన్న భయం వారిలో మొదలైందన్నారు. నాలుగు సంవత్సరాలుగా దోపిడీ, దౌర్జన్యాలతో కొనసాగిన వైసీపీ అరాచక పాలనలో విసుగెత్తిన ప్రజలు ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా చంద్రబాబు ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు నిర్ణయించుకున్నారని తెలిపారు.

ree

యువతలో చైతన్యం రావడమే మన రాష్ట్రానికి అభివృద్ధి సూచిక అని అన్నారు. ఈ ఎన్నికల పలితాలు రానున్న ఎన్నికల ఫలితాలకు శుభారంభం అని తెలిపారు. ఇదే ఉత్సాహంతో అందరూ కలిసికట్టుగా శ్రామికుల్లా పనిచేసి టీడీపీ ని అధికారంలోకి వచ్చే దిశగా తోడ్పడదామని అయన పిలుపునిచ్చారు. ఇంతటి ఘనివిజయాన్ని అందించిన పట్టుభద్రులకు, టీడీపీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page