top of page

అమ్మవారిశాలలో కనులవిందుగా శ్రీసీతారాముల కళ్యాణం

  • Writer: MD & CEO
    MD & CEO
  • Apr 10, 2022
  • 1 min read

అమ్మవారిశాలలో కనులవిందుగా శ్రీసీతారాముల కళ్యాణం - పెద్ద ఎత్తున పాల్గొన్న ఆర్యవైశ్యులు.


చిట్వేలి మండల పరిధిలోని శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఈరోజు ఉదయం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా... టీవీఎస్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో లక్ష్మణ సమేత శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వేదమంత్రాల, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు.

మండల పరిధిలోని ఆర్య వైశ్యు పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని కల్యాణాన్ని తిలకించి పారవశ్యం పొందారు. ఆలయ అర్చకులు శ్రీరామనవమి విశేషాన్ని అందరికీ తెలియపరిచారు. తదుపరి పానకం, వడపప్పు ప్రసాదాలను అందరికీ పంచిపెట్టారు.

ree
ree
ree
ree
ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page