శ్రీకాకుళంలో కాల్పుల కలకలం
- PRASANNA ANDHRA

- Jan 19, 2022
- 1 min read
శ్రీకాకుళం జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి, రామచంద్రాపురం సర్పంచ్‌పై దుండగుల దాడి,
రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై దుండగులు కాల్పులు జరిపారు. తూటలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది.
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. రామచంద్రపురం గ్రామ సర్పంచ్ వెంకట రమణ మూర్తి పై అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. మరురానగర్లోని ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంట తీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారు.














Comments