top of page

వైభవోపేతంగా శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 6, 2022
  • 1 min read

అమ్మ చల్లని చూపు అందరిపై ఉండాలన్న: చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

చిట్వేలు మండలం నాగవరం గ్రామపంచాయతీ చొప్పావారి పల్లి గ్రామం నందు గ్రామస్తులు అందరూ కలిసి శ్రీగంగమ్మ తల్లి నూతన గుడిని నిర్మించగా; మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.. శ్రీ గంగమ్మ తల్లి విగ్రహాన్ని బహూకరించి గ్రామస్థులతో కలిసి ప్రతిష్టించారు.

ree

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు భక్తి ప్రదాయిని, కొంగు బంగారమైన ఈ గంగమ్మ తల్లి....అందరికీ ఆయురారోగ్యాలు, పాడి పంటలు, చల్లని దీవెనలు ఇవ్వాలని కోరారు. తదుపరి అగ్ని హోమ క్రతువులు, అన్న దానాలు గొప్పగా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని అధికారులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page