top of page

సింహాచలం దేవస్థానం ఆలయ కమిటీ మెంబెర్ ప్రమాణ స్వీకారం.

  • Writer: MD & CEO
    MD & CEO
  • Apr 7, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర విలేకరి


సింహాచలం దేవస్థానం ఆలయ కమిటీ మెంబెర్ ప్రమాణ స్వీకారం.

ree

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వుల మేరకు 235 జీ.వో ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన. 76 వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం దేవస్థానం సీఈవో సూర్య కళ బోర్డు మెంబర్ లందరికీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది.

ప్రమాణ స్వీకారం అనంతరం బోర్డు మెంబర్ అయినటువంటి రమణ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయసాయి రెడ్డి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి , గాజువాక నియోజకవర్గ ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి, వైయస్సార్సీపి స్టాండింగ్ కమిటీ వంశీ రెడ్డి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన వార్డు సభ్యులు, వై. ఎస్. ఆర్. సి .పి పెద్దలకు, ప్రజలకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సింహాచలం దేవస్థానం ఆలయ అభివృద్ధికి అలాగే ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సేవా కార్యక్రమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశానని వాపోయారు .ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం తాటికొండ జగదీష్,తాటికొండ అచ్యుత్,జయరాజు,మంత్రి మంజుల,పూడి శాంతి,గోరుసు రామలక్ష్మి,షేక్ ఆశ, గొంప రామజ్యోతి, గొంప రమేష్, కోవిరి అప్పారావు, పెంటకోట పైడిరాజు, గాలి బాబురావు, మీసాల ఉమా శంకర్, శివ, కక్కుళ్ల మురళి, ముమ్మిడివరపు నరసింహమూర్తి, ఇళ్ల శివ, ఆలయ సిబ్బంది మరియు కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page