ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
- EDITOR

- 1 day ago
- 1 min read
ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆంధ్రప్రదేశ్ మదర్ థెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో అని బిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా" ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం" నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమ రాష్ట్ర అధ్యక్షుడు షాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ 66వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందు సాగాలని తెలిపారు. అదేవిధంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతో దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనస్సు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల నాయకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించాలని సంక్షేమ పథకాలు అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమంలో గౌసీపీర్, హనుమంతు, సావిత్రి, కృష్ణవేణి, మాబు, అంజలి, సుబ్బయ్య, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.








Comments