త్రుటిలో తప్పిన ప్రమాదం
- PRASANNA ANDHRA

- Jan 19, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, నరసరావుపేట, పల్నాడు రోడ్డు మయూరి లాడ్జ్ ఎదురుగా, తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ బస్సు లారీని ఢీకొంది, అదే సమయంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి ని లారీ ఢీకొట్టడంతో బస్సు కింద కు దూసుకెళ్ళాడు.బైక్ నడుపుతున్న వ్యక్తికి ఘటనలో స్వల్ప గాయాలు అయ్యాయి.ఎప్పుడూ రద్దీగా ఉండే పల్నాడ్ రోడ్లో ఇలాంటి యాక్సిడెంట్ లు జరుగుతున్నాయంటే ఇంజనీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్లు ఏ విధంగా వాహనాలు నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిపైన ఆర్టీఏ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








Comments