రైల్వేకోడూరులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కొరముట్ల
- DORA SWAMY

- Mar 12, 2022
- 1 min read
వై. ఎస్. ఆర్. కడప జిల్లా, రైల్వేకోడూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు ఈరోజు ఉదయం రైల్వేకోడూరు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు పార్టీ జెండా ఎగురవేసి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మరియు చిట్వేలు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు తదితర మండలాల నాయకులు, అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.














Comments