ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డుకు మహర్దశ
- EDITOR

- 1 day ago
- 1 min read
ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డుకు మహర్దశ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దుమ్ము ధూళితో నిండిన ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డుకు మహర్దశ పట్టింది. ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని హనుమాన్ జంక్షన్ నుండి వాసవి సర్కిల్ వరకు నూరు అడుగుల వెడల్పుతో తారు రోడ్డు, రోడ్డు నడుమున డివైడర్లు వాటికి విద్యుత్ దీప అలంకరణతో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు కొత్త శోభను సంతరించుకోనుంది. ఈ సందర్భంగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సోమవారం ఉదయం రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ జెడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి ల ఆదేశాల మేరకు పనులు చురుకుగా, ప్రణాళిక బద్ధంగా చేపడుతున్నట్లు, నూతనంగా నిర్మించిన మోరి పనులు పూర్తి అయ్యే నాటికి రోడ్డు విస్తరణ నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








Comments