ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి
- PRASANNA ANDHRA

- Jan 18, 2023
- 1 min read
రాబోవు 2024 ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని మీరు భావిస్తున్నారా?
అవును - YES
లేదు - NO
చెప్పలేము - CAN'T SAY
ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా పొట్టిపాడు బైపాస్ నందు గల ఆయన విగ్రహానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి చరిత్ర సృష్టించిన నాయకుడు ఎన్టీఆర్ అని, తాను ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జిగా పనిచేయటం ఆయన పూర్వజన్మ సుకృతం గా అభిప్రాయపడ్డారు. అటు సినీ రంగంలో ఇటు రాజకీయాలలో ఎన్టీఆర్ నూతన ఒరవడి, ప్రభంజనం సృష్టించారని ఆయన కొనియాడారు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి పెద్దపీత వేసిన లెజెండ్ గా ఆయనను అభివర్ణిస్తూ, ఎన్టీఆర్ పై అధికార పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బండి భాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్ అభిమాని సిద్దయ్య, పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మధ్యాహం పన్నెండు గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.










Comments