top of page

జిల్లా కేంద్ర ప్రారంబోత్సవ చారిత్రాత్మక ఘట్టానికి అందరూ ఆహ్వానితులే

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 2, 2022
  • 1 min read

Updated: Apr 3, 2022

రాయచోటి ప్రసన్న ఆంధ్ర విలేకరి (ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ)

జిల్లా కేంద్ర ప్రారంబోత్సవ చారిత్రాత్మక ఘట్టానికి అందరూ ఆహ్వానితులే... ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆహ్వానం

ree

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిలో జిల్లా కార్యాలయాల ప్రారంబోత్సవ చారిత్రాత్మక ఘట్టానికి ప్రజాప్రతినిధులు,అధికారులు, ప్రజలు అందరికీ ఇదే ఆహ్వానంగా భావించాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.పాలనా సౌలభ్యంలో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నూతన జిల్లాల ఆవిష్కరణకు సిద్ధమయ్యారన్నారు.ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించారు.అన్ని కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, తగిన మౌలిక వసతుల ఏర్పాటులో అధికారులు అనతికాలంలోనే పూర్తి చేశారన్నారు.ఈ దశలో శుభకృత్ నామ సంవత్సర , రంజాన్ మాసపు ప్రారంభ వేళల్లో ఈ నెల 4 వ తేదీన జిల్లా కేంద్ర ప్రారంబోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందన్నారు.95 శాఖల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుచున్నాయని,నాలుగువేలకు మందికి పైగా అధికారులు, సిబ్బంది స్థానికంగానే నివాసాలు ఏర్పరచుకొనున్నారన్నారు.ఈ నెల 3 నుండి 9 వరకు జరిగే జిల్లా ఆవిర్భావ దినోత్సవాలకు అందరూ ఆహ్వానితులే అని పిలుపునిచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page