top of page

డాక్టర్ నిర్లక్ష్యం పసిప్రాణం బలి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 8, 2022
  • 1 min read

నెల్లూరులో ఓ పసిప్రాణం బలైపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందంటూ తల్లిదండ్రులు, బంధువులు.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. తమ కూతురిని బలిచేశారంటూ తల్లడిల్లిపోతున్నారు. డాక్టర్ గంగా ప్రభంజన్ కుమార్ నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని అంటున్నారు తల్లిదండ్రులు. పద్మావతి ఆస్పత్రి మూసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చరిష్మా అనే పాపకు ముక్కు ఆపరేషన్ జరిగింది. అయితే ఈ ఆపరేషన్ తర్వాత 11 ఏళ్ల ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. డాక్టర్లు సరైన సమాధానం చెప్పలేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఇదే ఆస్పత్రిపై పలు ఆరోపణలున్నాయి. రెండుసార్లు రోగులు చనిపోయిన ఘటనల్లో బంధువులు ఆందోళన చేసిన ఉదాహరణలున్నాయి. కరోనా సమయంలో కూడా ఆస్పత్రిపై పలు ఆరోపణలు వచ్చాయి. తాజాగా జరిగిన ఘటనతో మరోసారి పద్మావతి ఆస్పత్రి పేరు నెల్లూరులో సంచలనంగా మారింది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page