బాలిక మృతదేహం కలకలం
- PRASANNA ANDHRA

- Feb 9, 2022
- 1 min read
కృష్ణాజిల్లా కంచికచర్ల
బాలిక మృతదేహం కలకలం, కంచికచర్ల మండలం కీసర గ్రామం జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఇన్వెంటర్స్ కెమికల్ ఫ్యాక్టరీ వెనుక భాగాన సుబాబుల్ తోటలో గుర్తుతెలియని బాలిక మృతదేహాన్ని స్థానికులు కనుగొని కంచికచర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ నాగేంద్రకుమార్, ఎస్ఐ లక్ష్మీ బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









Comments