ఎంపీ రమేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు
- EDITOR

- 16 hours ago
- 1 min read
ఎంపీ రమేష్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు

వైయస్సార్ కడప జిల్లా
అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ నాయుడు మాతృమూర్తి రత్నమ్మ పెద్దకర్మ సందర్భంగా పలువురు ప్రముఖులు వైయస్సార్ కడప జిల్లా పోట్లదుర్తి గ్రామం నందు సీఎం రమేష్ కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. ఇటీవల రత్నమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో రత్నమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ, రత్నమ్మకు సద్గతులు ప్రాప్తించాలని ఆకాంక్షించారు. తన బిడ్డలను వ్యాపార వాణిజ్య రాజకీయ రంగాలలో రాణింప చేసేలా తల్లి రత్నమ్మ తీర్చిదిద్దారని, వారు రానున్న రోజులలో దేశానికి మహత్తర సేవలు అందించాలని కోరారు. అనంతరం సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రులు అచ్చెనాయుడు, చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ గ్రీష్మ, పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.








Comments