top of page

కొనిరెడ్డిని అభినందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 22, 2023
  • 1 min read

కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని భుజం తట్టి అభినందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

ree
ree

కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డు స్థానానికి జరిగిన ఎన్నికల్లో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తనయుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అఖండ విజయం సాధించడం పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శభాష్ అంటూ హర్షవర్ధన్ రెడ్డిని భుజం తట్టి అభినందించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రచార సరళి, పోలింగ్, విజయం సాధించిన తీరును ఎంపీ అవినాష్ రెడ్డి ఆసక్తిగా ఆలకించారు. ఖాజీపేట మండలంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉన్న ఎంపీని శివచంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆది నుంచి వైయస్ కుటుంబం వెంట నడుస్తున్న తమకు పార్టీ నుంచి, వైయస్ కుటుంబం నుంచి లభిస్తున్న ఆదరణ, అభిమానం, ప్రోత్సాహానికి సదా కృతజ్ఞులమై ఉంటామని కొనిరెడ్డి తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ నమ్మకానికి, విశ్వాసానికి, అంకితభావానికి మారుపేరుగా నిలిచిన కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానం మరింత ఉత్సాహంగా, మరిన్ని విజయాలు సాధించే దిశగా సాగాలని ఆకాంక్షించారు.

ree
ree
ree
ree
ree
ree
CALL NOW 9908051001

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page