శుభాలు వర్షించే వరాల వసంతం రంజాన్ - ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
- PRASANNA ANDHRA

- Apr 29, 2022
- 1 min read
ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, రాయచోటి)

శుభాలు వర్షించే వరాల వసంతం రంజాన్ అని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాయచోటి పట్టణంలోని బంగ్లా సమీపంలో ఉన్న చున్నా మసీదులో ముస్లిం సోదరులతో కలసి నమాజ్ లో పాల్గొన్నారు . ఉపవాస దీక్ష (రోజా)తో ఆయన నమాజ్ ప్రార్థనలు చేశారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసంలో దైవ చింతనతో నెల రోజుల పాటు నియమబద్ధ జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, ఓర్పు, సానుభూతి, సేవాభావం వంటి సద్గుణాలు అలవడడంతోపాటు జీవితంలో ఎలాంటి కఠిన పరీక్షలనైనా ఎదుర్కోగలమనే ఆత్మవిస్వాసం పెంపొందుతుందన్నారు. దేవుడి దయతో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా జీవించాలని, మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి ప్రాంతం నిలవాలని, నూతన అన్నమయ్య జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సంధర్బంగా ముస్లిం సోదరులుకు శ్రీకాంత్ రెడ్డి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అధికారిక ఇఫ్తార్ విందుకు ముంస్లిం సోదరులును ఆహ్వానించిన శ్రీకాంత్ రెడ్డి.








Comments