MLA సొంత నిధులతో డ్రైనేజీ, రోడ్ నిర్మాణం
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
గత కొద్ది రోజుల క్రితం కొర్రపాడు రోడ్డు లోని కామిశెట్టి కాలేజీ ఎదురుగా ఉన్న విద్యా నగర్ కాలనీ వాసులకు రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ కు సంబంధించిన సమస్యను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అటువైపు వెళ్ళుటకు అడ్డుగా పట్టా కలిగి ఉన్న స్థలంలో ఒక సెంటు స్థలాన్ని శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లక్షల రూపాయల తన సొంతడబ్బుతో కొని రోడ్ మరియు డ్రైనేజీ కాలువను వేయించి నూతనంగా ఏర్పాటు చేసిన విద్యానగర్ కాలనీ బోర్డును ప్రారంభించడం జరిగినది, ఈ కార్యక్రమంలో గోపురం సర్పంచ్ గద్దె మోష, ఉప సర్పంచ్ రాఘవ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఓబయ్యా యాదవ్ పాల్గొన్నారు.










Comments