top of page

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి - కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 11, 2022
  • 1 min read

ree

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన వైసీపీ ప్రభుత్వం 11 ఏళ్ల కాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక...కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను దాదాపు అమలు చేస్తూ.. చెప్పని హామీల తోపాటు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ప్రజల నుంచి అనేక మన్ననలు పొందుతూ ఉన్నదని...


వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవమయిన మార్చి 12వ తేదీన రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, గ్రామాలలో వైసీపీ పార్టీ జెండాను ఎగురవేయాలని... దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు రంగులు వేసి,పూలమాలలతో అలంకరించాలని.. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు వైసిపి పార్టీ నాయకులను, మండల కన్వీనర్ లను, జెడ్పీటీసీ లను, ఎంపీటీసీ లను, సర్పంచులను, పార్టీ కార్యకర్తలను, అభిమానులను కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page