top of page

11న జరగనున్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 9, 2022
  • 1 min read

ree

ప్రసన్న ఆంధ్ర వార్త, ఏపీ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 11న ఉదయం 11.31కు మంత్రులు ప్రమాణం చేస్తారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం చేశారు. ఇన్విటేషన్‌లు పాసులను ప్రోటోకాల్ అధికారులు సిద్ధం చేసింది. మరోవైపు వెలగపూడి సచివాలయం వద్ద చక చక స్టేజీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న జరగనున్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సమీర్‌ శర్మ ఆదేశించారు. బ్లూబుక్‌లోని నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. గవర్నర్‌, సీఎంతో నూతన మంత్రివర్గ సభ్యులు గ్రూపు ఫోటో దిగేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ప్రొటోకాల్‌, సమాచారశాఖ అధికారులను ఆదేశించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page