top of page

ఘనంగా ఉమామహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 13, 2023
  • 1 min read

ఘనంగా ఉమామహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

ree

ఎంత ఎదిగిన ఒదిగిపోయే మనిషి తాను. అన్నా అని పిలిస్తే పార్టీలకతీతంగా సహాయం చేసే గుణం తనది. తన తండ్రి చౌడవరం రఘురాం రెడ్డి తనయుడుగా, అన్న భాస్కర్ రెడ్డి అడుగుజాడల్లో నిరంతరం చిట్వేలి ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించే వ్యక్తిగా, అందరివాడు గా ఎదిగిన తీరు శహబాష్ అనిపించక మానదు. పలుమార్లు గ్రామ సర్పంచ్ గా, వైసీపీ సీనియర్ నాయకులుగా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కష్టించే వ్యక్తి చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి. ఆదివారం వైసిపి నాయకులు, అభిమానులు చిట్వేల్ లో ఉమామహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు, కేకులు కట్ చేసి పలువురు తమ అభిమానాన్ని చాటుకున్నారు. సామాజిక మాధ్యమాలలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా గణేష్ హోటల్ వారు మానవతా ఆధ్వర్యంలో పేదలకు యాచుకులకు చికెన్ బిర్యానీలు పంచిపెట్టారు.


ఇంతమంది అభిమానులను పొందడం, వారి మధ్య నా జన్మదిన వేడుకలను నిర్వహించడం నేను, నా కుటుంబం చేసుకున్న అదృష్టమని ఉమామహేశ్వర్ రెడ్డి అన్నారు.


జన్మ దిన వేడుకల్లో వైసీపీ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, వైసిపి నాయకులు బసిరెడ్డి. రమణారెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, లింగం లక్ష్మికర్, అభిమానులు శ్రీనివాసులు,హజరత్ రెడ్డి,నాగరాజు, కస్తూరి మని, నరసింహ, వెంకటేశు, ముస్లిం మైనారిటీ సభ్యులు, మానవత బాధ్యులు మునిరావు, చిట్వేలు పంచాయతీ,సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page