top of page

దళిత యువతిని నమ్మించి మోసం చేసిన పాత్రికేయుడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 16, 2022
  • 1 min read

దళిత యువతిని ప్రేమించి, కోరిక తీరాక వంచించి, మరో పెళ్లి చేసుకున నయవoచకుడు అరెస్ట్


Cr.No.08/2022,U/sec 323,420,506IPC R/W34 IPC,sec.3(1)(r),3(1)(s),3(2)(va)SC/ST POA ACT of sathyavedu PS


నిందితుడు చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం కుప్పడుతాగేలి నివాసి పాత్రికేయుడు వెంకటేష్.


దళిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్ముంచి కోరిక తీరాక వంచించి మరో పెళ్లి చేసుకున్న నిందితుడు స్టూడియో N రిపోర్టర్ వెంకటేష్ ను అరెస్ట్ చేసినట్లు సత్యవేడు ఎస్సై పురుషోత్తంరెడ్డి తెలిపారు. బాధితురాలు ఇచ్చిన పిర్యాదు, ఎస్సై పురుషోత్తంరెడ్డి కథనం మేరకు సత్యవేడు మండలo రేపల్లెవాడ హరిజనవాడకు చెందిన k చక్రపాణి కుమార్తె సునీత అనే యువతిని వరదయ్యపాలెం మండలం పాండురు పంచాయతీ కుప్పడు తాగెలి కి చెందిన స్టూడియో ఎన్ రిపోర్టర్ వెంకటేష్ గత అయిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో బాధిత యువతి పై కోరిక తీర్చుకున్నాడు. అవసరం తీరాక నిందితుడు వెంకటేష్ రహస్యంగా మరోవివాహం చేసుకున్నాడు. ఆలస్యంగా పెళ్లి అయిన విషయం తెలుసుకున్న బాధితురాలు సునీత తనకు జరిగిన అన్యాయంపై వెంకటేష్ ను నిలదీయడంతో.. మాల కులానికి చెందిన నిన్ను ఎలా పెళ్లి చేసుకునేది.. నా కోరిక తీర్చుకున్నాక.. నాకు నీ అవసరం లేదని కులం పేరుతో దూషించడంతోపాటు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ వెంకటేష్ చెప్పడంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తు ఎదురు తిరిగడంతో సునీతను తోసివేస్తు కొట్టాడు. ఆమె మరో గత్యంతరం లేక పెద్ద మనుషులకి విన్నవించుకోగ.. గ్రామపెద్దలు రాజీ చర్చలు జరిపారు. అయినా వెంకటేష్ నేను విలేకరి ని నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ ఎదురు చెప్పడంతో బాధితురాలు న్యాయం చేయాలని ఎస్సై పురుషోత్తంరెడ్డికి జరిగిన అన్యాయంపై మొర పెట్టుకుంది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్సై కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేష్ ను అరెస్ట్ చేసి కోర్టులోహాజరుపరచగా రిమాండ్ విధించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page