ఇల్లూరులో అర్ధరాత్రి ఇసుక త్రవ్వకాలు
- PRASANNA ANDHRA

- Oct 10, 2023
- 1 min read

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, ఇల్లూరు గ్రామంలో ఇసుక రవాణా జోరుగా సాగుతుందంటూ, పరిమితికి మించి తవ్వకాలు జరిపారని ఆరోపిస్తూ గ్రామస్తులు గతంలో బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ తమకు త్రాగునీరు సాగునీరు అడుగంటయని ఇసుక త్రవ్వకాలు ఆపాలంటూ నిరసన తెలిపారు. పర్యావరణాన్ని కాపాడాలి నీటి వనరులు తగ్గుతున్నాయంటు హైకోర్టును ఆశ్రయించారు గ్రామ ప్రజలు. ఇక్కడ ఇసుక త్రవ్వకాలు పగటి పూటే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఎదేశ్చగా జరుపుతున్నారు, అర్ధరాత్రి కూడా జెసిబి లతో ఇసుకను టిప్పర్లలో లోడింగ్ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తు క్వారీ రూల్స్ ప్రకారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక త్రవ్వకాలు జరపాలని అయితే ఇందుకు విరుద్ధంగా అధికారులను అడ్డు పెట్టుకొని రాత్రి పగలు ఇసుక తోలుతున్నరని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని రాత్రిపూట ఇసుక త్రవ్వకాలు ఆపాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.









Comments