ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొరముట్ల
- DORA SWAMY

- May 1, 2022
- 1 min read
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొరముట్ల.

భిన్నత్వంలో ఏకత్వ నిదర్శనమే ఇఫ్తార్ విందు అన్న కొరముట్ల. పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు.

ఈరోజు సాయంత్రం రైల్వే కోడూరు పట్టణం రాజ్ కన్వెన్షన్ సెంటర్ నందు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు రంజాన్ మాసాన్ని పరిష్కరించుకొని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముస్లింలకు అతి పవిత్ర మాసమైన ఈ రంజాన్ నందు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేందుకే ఈ ఇఫ్తార్ విందు దోహదపడుతుందని ..మనఅందరం ఒక్కటేనని మనది భారత జాతీ అని; కులమతాలకతీతంగా ముందుకెళ్లాలని ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల కుటుంబాల్లో క్రొత్త వెలుగులు నింపాలని పేర్కొంటూ ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









Comments