గూడూరు లో అర్ధరాత్రి భార్యను హత్య చేసిన భర్త
- PRASANNA ANDHRA

- Jan 29, 2022
- 1 min read
గూడూరు లో అర్ధరాత్రి భార్యను హత్య చేసిన భర్త, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కొట్టి చంపినట్టు సమాచారం, మృతురాలు సూరిపాక పుష్ప (43), నిందితుడు సూరిపాక ప్రకాష్ గా స్థానికుల సమాచారం, గూడూరు లోని అరుంధతీయపాళెం లో నిన్న అర్ధరాత్రి భార్యా భర్తల మధ్య తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని జరిగిన చిన్న గొడవలో ఎస్. ప్రకాష్ అనే వ్యక్తి భార్య పుష్పని ఇనుప కమ్మితో తలపై మోదగా ఆమె సంఘటన స్థలంలోనే మరణించి నట్టు స్థానికుల సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.









Comments