top of page

గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ గా మండ్ల రమాదేవి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 20, 2023
  • 1 min read

గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ గా మండ్ల రమాదేవి ప్రమాణస్వీకారం

ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం, గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ గా మండ్ల రమాదేవి శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరుగగా, సర్పంచ్ జి. మోష ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ గా రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, ఓసి, బిసి, ఎస్సిలకు ప్రాధాన్యత కల్పిస్తూ గోపవరం పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచుల ఎన్నిక జరిగిందని, అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ నిర్ణయం తీసుకొని గోపవరం పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉప సర్పంచ్ గా ఉన్న రాఘవరెడ్డి పార్టీ నిర్ణయాల మేరకు తన రెండున్నర సంవత్సరాల పదవీకాలం ముగియడంతో రాజీనామా సమర్పించగా రమాదేవిని ఉపసర్పంచిగా ఎన్నుకున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వరకుటి రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ దేవి ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ జి. మోష, ఎంపీటీసీలు ఓబయ్య యాదవ్, భూసం రవి, మండల ఉపాధ్యక్షులు ఆసం దస్తగిరి రెడ్డి, వార్డ్ మెంబర్లు ఆదినారాయణ, మధు, సిద్దయ్య, వైసిపి నాయకులు కొండయ్య, వెంకట్రాంరెడ్డి, సురేష్, శంకర్, ఆజం, తిరుమలయ్య, జాకీర్, ఆచారి కాలనీ శివారెడ్డి, ద్వారకా నగర్ వెంకటేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ree
ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Oct 20, 2023
Rated 5 out of 5 stars.

Congratulations

Like
bottom of page