తారాజువ్వలు ఎగిసిపడి బోధకొట్టం దగ్ధం
- PRASANNA ANDHRA

- Nov 13, 2023
- 1 min read
తారాజువ్వలు ఎగిసిపడి బోధకొట్టం దగ్ధం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
తారాజువ్వలు ఎగసిపడి బోధ కొటం దగ్ధమైన సంఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డు నాలుగు రోడ్ల కూడలి, ఎస్సీఎన్ఆర్ ఆర్ట్స్ కళాశాల దగ్గరిలోని బోధకొట్టం సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అగ్నికి ఆహుతి అయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక తారాజువ్వలు ఎగసిపడటం కారణమా అనే పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది. కొట్టం నివాసయోగ్యం కానందున ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణనష్టం కానీ జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు.









Comments