top of page

పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన కస్తూరి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Oct 13, 2022
  • 1 min read

నమ్మకం నాణ్యత వ్యాపార అభివృద్ధికి ఆయువుపట్టు.

-ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభంలో కస్తూరి.

ree

నమ్మకం నాణ్యతతో కూడిన వ్యాపారం అభివృద్ధికి ఆయువుపట్టు అని ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభంలో రైల్వే కోడూరు టిడిపి బాధ్యులు కస్తూరి విశ్వనాథ నాయుడు పేర్కొన్నారు. చిట్వేలి రాజంపేట ప్రధాన రహదారిలో కేకే వడ్డిపల్లి సమీపాన బుధవారం భారత్ కంపెనీ వారి మహేశ్వరి పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. వినియోగదారునికి ప్రామాణికతో కూడిన నాణ్యతను అందించినప్పుడే మన పై నమ్మకం కుదురుతుందని, తద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని పెట్రోల్ బంకు నిర్వహకురాలు రాయన ఆదిలక్ష్మికి, కస్తూరి సలహా ఇచ్చారు.మహిళలు వ్యాపార రంగంలో ముందుండాలని వారిని మనం ప్రోత్సహించాలని అన్నారు.

ree

రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షురాలు అనసూయమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జయచంద్ర, కోడూరు టిడిపి మహిళా అధ్యక్షురాలు అనితా దీప్తి, కటికం సునీత తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page