ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read

చిత్తూరు జిల్లా, పెద్దతిప్ప సముద్రం, యువతి అనుమానాస్పద మృతి, పి టి ఎం మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద ఘటన, మృతురాలు బీ.కొత్తకోట కు చెందిన హార్దిక 19 గా పోలీసులు గుర్తింపు.
మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థి హార్దిక. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం నేర్చుకుంటానని వెళ్లిన కూతురు కనపడకపోవడం తో తల్లిదండ్రులు వెతుకులాట, కృష్ణాపురం పొలాల వద్ద మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం. బడికాయలపల్లికు చెందిన యువకుని ప్రేమించింది కులాలు వేరు కావడంతో పెద్దమనుషుల విడదీత. మృతదేహాన్ని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగింత, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బి.కొత్తకోట ఎస్ ఐ మధు రామచంద్రుడు.








Comments