తాగిన మత్తులో ఆకతాయి హాస్పిటల్ కి నిప్పు
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
Updated: Jan 13, 2022
అసలే ఆకతాయి ఆపై తాగిన మత్తు, ఏమి చేస్తున్నాడో తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో, కావాలని చేస్తున్నాడో, అక్కడి హాస్పిటల్ సిబ్బందికి తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగింది, అటు హాస్పిటల్ సిబ్బందికి నష్టం వాటిల్లగా, పేషెంట్లను ఊపిరాడక పరుగులు పెట్టించాడు ఆ ఆకతాయి, వివరాల్లోకి వెళితే
ప్రొద్దుటూరు పట్టణం జమ్మలమడుగు రోడ్ లో ఉన్న అక్షయ ఆసుపత్రి లో పేషెంట్ల గదికి ఏర్పాటు చేసిన ఏసీ కి ఉదయ్ అనే వ్యక్తి నిప్పంటించాడు అని, ఆసుపత్రి ప్రాంగణంలో బాణసంచాను ఉద్దేశపూర్వకంగా పేల్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, ఈ విషయమై డ్యూటీ లో ఉన్న మహిళ వైద్యురాలు ప్రశ్నిస్తే తీవ్రపదజాలంతో దుర్భాషలాడాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు, దీంతో ఏసీకి మంటలు వ్యాపించడంతో ఆందోళన వ్యక్తం చేసిన వైద్యులు, సిబ్బంది, మంటలు తీవ్రరూపం దాల్చుతున్న నేపధ్యంలో మంటలను ఆర్పి వేసిన ఆసుపత్రి సిబ్బంది. ఈ విషయమై మూడవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేసిన ఆసుపత్రి సిబ్బంది.
















Comments