కొనిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం, మేయర్ అభినందనలు
- PRASANNA ANDHRA

- Aug 21, 2023
- 1 min read
కొనిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డికి డిప్యూటీ సీఎం, మేయర్ అభినందనలు


కొత్తపల్లె పంచాయతీ 13వ వార్డు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తనయుడు కొనిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్‌బాబు అభినందించారు. సోమవారం కడపలో శివచంద్రారెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి వారిని కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలో విజయం సాధించిన తీరును వివరించారు. అనంంతరం శాలువాతో డిప్యూటీ సీఎం, మేయర్‌ను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎల్లప్పుడూ వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉంటామని, మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఇందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వారు కొనిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డిని అభినందించారు.












Great siva annaya