9సం'' బాలిక హత్య కేసును చేదించిన పోలిసులు
- PRASANNA ANDHRA

- Feb 14, 2022
- 1 min read
కృష్ణాజిల్లా, నందిగామ కంచికచర్ల మండలం కీసర వద్ద ఈ నెల 9వ తేదిన జరిగిన బాలిక హత్య కేసును చేదించిన పోలిసులు. అత్యాచారం, హత్య కు గురైన 9సం బాలిక కేసులో ముద్దాయి పెడాల సైదులును మీడియా ముందు ప్రవేశ పెట్టిన పొలీసులు. ఈనెల 7వ తేదిన సైదులు బాలికను రిక్షా పై తీసుకెళ్లిన వైనం, సొంత బాబాయ్ సైదులు దారుణంగా హత్యచారం చేసి విషయం బయటకు వస్తే ప్రమాదమని రాయితో కొట్టి హత్య చేసినట్లుగా తెలిపిన డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి.

ముందు హత్య చేసినట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు. పోస్టు మార్టం రిపోర్టులో హత్యచారం చేసి హత్య చేసినట్లుగా నిర్దారణ. నిందితుడు సైదులను ఖమ్మం జిల్లా మధిర వద్ద పట్టుకున్న పోలీసులు.








Comments