top of page

పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు - కౌన్సిలర్ వంశీ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 17, 2023
  • 1 min read

పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు - కౌన్సిలర్ వంశీ

ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు, 32 వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, పార్టీలకతీతంగా లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమవుతుందని, అందుకు ఉదహరిస్తూ ప్రొద్దుటూరులోని పలువురు టిడిపి నాయకులకు, కార్యకర్తలకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. రాబోవు రోజుల్లో కూడా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగనున్నట్లు, ఎక్కడ కూడా అర్హత గల లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందని దాఖలాలు లేవని ఆయన అన్నారు. సాంకేతిక కారణాల వలన లేదా పలు కారణాల చేత పథకాలు అందని లబ్ధిదారులు తిరిగి సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో టిడిపి నాయకులు చేపట్టిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటున్న టిడిపి నాయకులకు, కార్యకర్తలకు కూడా వైసిపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఇకపోతే రాబోవు ఎన్నికల్లో కూడా వైసీపీ తన సత్తా చాటుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page