ఏ.ఐ.ఎస్.ఎఫ్ కేలెండర్ ఆవిష్కరించిన ఎం.ఎల్.సి
- PRASANNA ANDHRA

- Jan 18, 2022
- 1 min read
ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆంధ్ర రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఓబులేసు ఈరోజు వైకాపా ఎం.ఎల్.సి ఆర్. రమేష్ యాదవ్ ని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి నూతన సంవత్సర కేలెండర్ ని ఎం.ఎల్.సి ఆర్. రమేష్ యాదవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు, ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ కీలకమయినదని విద్యార్థి దశ నుండే దేశభక్తి కలిగియుండాలని, విద్యార్థి నాయకులు ఎల్లవేళలా విద్యార్థుల సమస్యలపై ద్రుష్టి సారించి, ప్రభుత్వ దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా తగు కృషి చేయాలని ఆకాంక్షించారు.









Comments